Siddham Meeting: అట్టర్ ప్లాప్ అయిన సిద్ధం చివరి సభ.. ఓటర్ల ఆశలన్నీ అడియాశలే అయ్యాయిగా!

Siddham Meeting: వైసీపీ అధినేత జగన్ వైఖరి ఎవరికీ ప్రజలకు, ఓటర్లకు ఎలాగూ అర్థం కాదు కానీ.. కనీసం పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు సిద్దం సభలను జగన్ నిర్వహించారు. ప్రజలు ప్రతీ సభలోనూ సీఎం ఏదైనా చెబుతారా అని ఎదురు చూడటం.. చివరికి అసంతృప్తిగా వెనుదిరగడమే జరిగింది. సిద్దం పేరుతో పెట్టిన అన్ని సభలు పూర్తి అయ్యాయి. మొదటి మూడు సభల్లోనూ ఎలాగూ ఏం చెప్పలేదు. కనీసం చివరి సభలోనైనా ఏమైనా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ.. ప్రకాశం జిల్లా అద్దంకిలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది.

ప్రతీ సభలోనూ ఒకటే స్పీచ్.. చంద్రబాబు, పవన్, లోకేష్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. గత ఐదేళ్లుగా అదే పని చేస్తున్నారు. ఆ మాత్రం దానికి సిద్దం అని కొత్తగా ఎందుకు పేరు పెట్టడమో అర్థం కావడం లేదు. బటన్ నొక్కే ప్రతీ కార్యక్రమం లోనూ జగన్ చేసే పని అదే. చివరికి సిద్దం పేరుతో పెట్టే ఎలక్షన్ సభలో కూడా అదే తంతు నడిస్తే ఎలా అని పార్టీ నేతలు విసుక్కుంటున్నారు. ఎలక్షన్ మీటింగ్ అంటే.. రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పాలి. బహిరంగ సభ పార్టీ అధినేత చెబితే.. అవే హామీలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి. ఇప్పటి నుంచి ప్రజల్లోకి తీసుకొని వెళ్తేనే.. ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లేసరికి వారికి ఆయా పార్టీలు ఇచ్చిన హామీలు గుర్తుకు వస్తాయి.

గత నాలుగు సభలుగా ప్రజలకు వైసీపీ నేతలు ఊరిస్తూ వస్తున్నారు. సిద్ధం సభలో జగన్ అద్భుతమైన హామీలు ఇస్తారని చెబుతూ వచ్చారు. ఆ నమ్మకంతోనే ప్రజలు సిద్దం సభలకు తరలివెళ్లారు. వరుసగా మూడు సభల్లో కూడా ఏం చెప్పకపోవడంతో నాలుగో సభలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ హామీలను ప్రకటిస్తారని ప్రచారం చేశారు. అదే ఆశతో మహిళలు, రైతులు అద్దంకి సభకు తరలి వెళ్లారు. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. చంద్రబాబు, పవన్, లోకేష్ తో పాటు ఈ సభలో బీజేపీని కూడా విమర్శించారు. అంతకు మించి ఏమీ లేదు.

ఓ వైపు నాలుగు నెలలుగా టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో మినీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇప్పటికే టీడీపీ హామీలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఇటీవలే టీడీపీ, జనసేన కలిసి బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించాయి. ఓ వైపు ప్రతిపక్షాల రేపు ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో క్లియర్ గా చెబుతున్నాయి. దాంతో పాటు రాజకీయ వ్యూహాలు కూడా సిద్దం చేస్తున్నాయి. వ్యూహాలు అమలు చేయడంలో సక్సెస్ అవుతున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఖాయం చేసుకున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే మెజార్టీ సీట్లను ప్రకటించాయి. మరో వారం రోజుల్లోనే మిగిలిన సీట్లు ప్రకటించడానికి సిద్ధం అవుతున్నాయి. జగన్ పార్టీ శ్రేణులను సిద్దం కావాలి అని అడుగుతున్నారు తప్పా ఆయన దేనికీ సిద్దం కావడం లేదు. ఎన్నికల్లో ప్రజలను వైసీపీకి ఓట్లు వేయడానికి సిద్దమా? అని ప్రశ్నిస్తున్నారు. కానీ, వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే దేనికి సిద్దమో జగన్ చెప్పలేకపోతున్నారు. ఎలాంటి ప్రకటనలు లేకుండా చంద్రబాబు, పవన్, లోకేష్ ను తిట్టడానికి నాలుగు సిద్దం సభలు పెట్టారు. అవి కూడా పలు సార్లు వాయిదాలు వేశారు. ఇన్నిసార్లు వాయిదాలు పడ్డాయంటే జగన్ ఏదైనా కీలక ప్రకటన చేస్తారని చాలా మంది భావించారు. కానీ.. వైసీపీ అధినేత ఓటర్లతో పాటు.. పార్టీ శ్రేణులను కూడా నిరుత్సాహ పరిచారు. పైగా పార్టీ శ్రేణులు ఇటీవల రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం చేశారు. దీంతో.. చాలా మంది ఆశగా ఎదురు చూశారు. ముందుగా అలాంటి ప్రచారం చేయకపోతే.. ప్రజలు నిరుత్సాహ పడేవారు కాదు. కానీ..అలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే ప్రమాదంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -