YS Jagan: ఎన్నికల కోడ్ కు ముందే ఆ కంపెనీకి 17,633 ఎకరాలు.. జగన్ మరీ ఈ రేంజ్ లో తెగించారా?

YS Jagan: ఎలాగూ ఈ ఎన్నికల్లో ఓడిపోతాం కనుక దొరికినకాడికి దోచుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన ముందు రోజు రిలీజ్ అయిన ఓ జీవోను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ప్రభుత్వ పథకాలకు నిధులు వెనక్కి పెట్టి అస్మదీయులకు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో, పాటు.. తన అనుకున్నవారికి, బినామీలకు ప్రభుత్వ భూములను అప్పనంగా ఇచ్చేశారు. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ అయిన ఇండోసోల్‌‌కు సోలాల్ పవర్ ప్రాజెక్టుల పేరుతో అడ్డుగోలుగా భూములు దోచిపెట్టారు. భూమి అంటే.. ఒకటో, రెండో ఎకరాలు అయితే పర్వాలేదు. ఏకంగా 17,633.73 ఎకరాలు ఇండోసోల్ అప్పగిస్తూ ఈ నెల 15న అంటే.. కోడ్ రిలీజ్ అవ్వడానికి ఒకరోజు ముందు నాలుగు జీవోలు రిలీజ్ చేశారు. కడప, నంద్యాల, అనంతపురంలో సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూమి ఇస్తున్నట్టు జోవోలో ఉంది. ఇచ్చిన భూమిలో 4714 ఎకరాల భూమి ఉచితంగా వాడుకోవడానికి ఇచ్చారు. మిగిలిన భూమిని ఎకరాకి ఏడాదికి రూ.31,000 రీజుకు ఇచ్చారు.

ఏదైనా ఓ కంపెనీకీ ప్రభుత్వం భూమిని ఇచ్చినపుడు ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ చూడాలి. ఎప్పుడు స్థాపించారు. దాని టర్నోవర్ ఎంత? ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? భవిష్యత్ ప్లాన్ ఏంటీ అని చాలా చూడాల్సి ఉంటుంది. కానీ, వాటిని పట్టించుకోకుండా అప్పనంగా వేల ఎకరాల భూములు కట్టబెట్టారు. ఐదేళ్లుగా లేని ఉపాధి కల్పన ఆలోచన జగన్ కు కోడ్ రిలీజ్ అవ్వడానికి ఒకరోజు ముందు ఎందుకు వచ్చిందో తెలియదు. ఐదేళ్లలో ఒక్క కంపెనీ కూడా ప్రారంభించలేదు సరికదా.. ఉన్న కంపెనీలను కూడా తరిమేశారు.ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుంటే.. రాయలసీమ వ్యాప్తంగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు భారీస్థాయిలో తీసుకొస్తామంటూ బినామీ కంపెనీలకు భూముల పందేరం మొదలుపెట్టారు. వేల ఎకరాల భూములు ఇచ్చారు కానీ.. ఆ కంపెనీ ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందో చెప్పలేదు.

ఇండోసోల్‌ కంపెనీకి జగన్‌ బినామీ కంపెనీ షిర్డీసాయి ఎలక్ర్టికల్స్‌ దీని మాతృ సంస్థ. జగన్ సీఎం అయిన తర్వాతే ఇండోసోల్‌ పుట్టింది. ఇంకా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. ఆ కంపెనీ మూలధనం కేవలం లక్షరూపాయలు మాత్రమే. అయితే, ఈ కంపెనీకి ఇప్పుడు భూముల ఇవ్వడం కాదు. 2023లోనే రామాయపట్నం పోర్టు సమీపంలో 5418ఎకరాలు కేటాయించి లీజు ఒప్పందం చేశారు. అయితే, జగన్ తీసుకొచ్చిన కొత్త పారిశ్రామిక విధానం వలన ఈ కంపెనీ భూమికి లీజుదారు నుంచి యజమానిగా మారింది. ఆ తర్వాత ఆ మరో 3,200 ఎకరాల భూమిని సేకరించుకునేందుకు అనుమతి ఇచ్చింది. 2023లో 8,348 ఎకరాలు, ఇప్పుడు 17633 ఎకరాలు ఆ కంపెనీకి అప్పగించారు. మొత్తం 25,981 ఎకరాల ప్రభుత్వ భూమి ఆ సంస్థ చేతికి వెళ్లిపోయింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -