Jagan Vs Chandrababu: జగన్ వర్సెస్ బాబు.. ఏ పార్టీ తొలి సంతకం దేనికో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Jagan Vs Chandrababu: మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక ఈసారి ఎన్నికలు మరింత సూత్రంగా మారుతున్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు బాబు పాలన చూసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రజలు మరో ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పాలన కావాలని కోరుకుంటూ ఆయనకు పట్టం కట్టారు. అయితే ఈ ఐదు సంవత్సరాలు పాటు జగన్ పరిపాలన కూడా చూశారు.

ఇప్పుడు జరగబోయే ఎన్నికలు చాలా కీలకమని చెప్పాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎవరి పాలన అయితే ప్రజలకు నచ్చిందో వారికే ఈసారి పట్టం కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇలా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి పెద్ద పీఠవేశారు ఈ రెండు కూడా రాష్ట్రానికి చాలా అవసరం కానీ ఈ రెండింటిని వీరిద్దరూ బ్యాలెన్స్ చేయలేకపోయారని చెప్పాలి.

ఇకపోతే ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో తమ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఏ ఫైల్ మీద చేస్తారనే విషయంపై కూడా బహిరంగంగా చెబుతున్నారు ఇటీవల తిరుపతిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే తిరిగి వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తానని ఇదే తన తొలి సంతకం అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు అయితే ఈ విషయం చెప్పడం వెనుక కూడా చాలా వ్యూహం ఉందని తెలుస్తుంది.

దాదాపు రెండు లక్షల మంది ఈ వాలంటీర్ చిరు ఉద్యోగం పైన ఆధారపడుతున్నారు అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల కోసం ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది కనుక ఈ జనాభా అంతటిని కూడా జగన్ ఈ ఒక్క హామీతో తన వైపుకు తిప్పుకున్నారు. మరోవైపు నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే తాను అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వదులుతానంటూ చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారు. మరి ఇద్దరూ హామీలను పరిగణలోకి తీసుకొని ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -