Bus Yatra: బస్సు యాత్ర వ్యూహం జగన్ కు షాకివ్వనుందా.. జగన్ కు వాళ్ల పబ్లిసిటీ అస్సలు లేదుగా!

Bus Yatra: ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. అన్ని పార్టీల అధినేతలు యాత్రల పేరుతో జనంలోనే ఉంటున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఇప్పటికే జనంలోకి దూసుకుపోతున్నారు. ఐదేళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయన విమర్శల జోరు పెంచుతున్నారు. అటు.. నారా లోకేష్ కూడా శంఖారావం పేరుతో యాత్రలు చేస్తున్నారు. పిఠాపురం నుంచి వారాహి యాత్రను పవన్ కూడా మొదలు పెట్టారు. ఎలక్షన్ షెడ్యూల్ రావడానికి ముందు జగన్ సిద్దం సభలను నిర్వహించారు. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో సిద్దం సభలను నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో సడెన్‌గా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఆయన బస్సు యాత్ర ప్లాన్ చేసుకున్నారు. అయితే.. యాత్ర ప్రారంభమై మూడు రోజులు అవుతున్నా.. ఎక్కడా జనం కనిపించడం లేదు. స్థానిక నేతల ప్రచారాల ముందు కూడా జగన్ బస్సు యాత్ర తేలిపోతుంది.

ఒకప్పుడు జగన్ యాత్ర అంటే… భారీగా కవరేజ్ ఉందేది. చిన్నా చితకా ఛానెల్స్ అన్ని వచ్చేవి. కానీ, ఇప్పుడు ఆయన బస్సు యాత్రకు కవరేజ్ దొరకడం లేదు. అసలు ఇది జగన్ యాత్రే నా అని సొంతపార్టీ నేతలే అనుకునేలా ఉంది. బహిరంగ సభలకు పెద్ద ప్రాంగాణాల్లో సభను ఏర్పాటు చేస్తారు. అక్కడ జనం ఎంత మంది వచ్చినా కనిపించరు. కానీ.. బస్సు యాత్రలు అంటే.. కొద్ది మంది జనం వచ్చినా.. బాగానే కనిపిస్తారు. అలాంటిది జగన్ యాత్రలో జనం లేకుండానే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయంటే.. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు కూడా తన ప్రచారంలో ఇదే విషయంపై సెటైర్లు వేస్తున్నారు. బోజనం పెడతా రండి.. ఉండండి.. కాసేపు మా మాటలు వినండని వైసీపీ నేతలు చెబుతున్న మాటలను చంద్రబాబు కోడ్ చేస్తున్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సీఎం యాత్రలు ప్రజలు కాకపోయినా.. కార్యకర్తలు అయిన ఎందుకు పాల్గొనటలేదు అని పార్టీలో కీలకనేతలు జట్టుపీక్కుంటున్నారు. అయితే.. సిద్దం సభలే దీనికి కారణమని తెలుస్తోంది. సిద్దం సభలకు జగన్ ఏం హామీ ఇస్తారా అని వినడానికి వెళ్లారు. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ హమీ ఇస్తారని ప్రజలు సిద్దం సభలకు తరలివెళ్లారు. కానీ.. చూస్తే జగన్ ఇచ్చిన హామీ లేదు. నాలుగు సిద్ధం సభల్లో కూడా కొత్తగా ఏం చెప్పలేదు. ప్రతీ సభలోనూ ఒకటే స్పీచ్.. చంద్రబాబు, పవన్, లోకేష్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. గత ఐదేళ్లుగా అదే పని చేస్తున్నారు. ఆ మాత్రం దానికి సిద్దం, మేమంత సిద్దం పేరుతో ప్రచారం ఎందుకు అని ప్రజలకు అనిపించింది. బటన్ నొక్కే ప్రతీ కార్యక్రమం లోనూ జగన్ చేసే పని అదే. సిద్దం సభల్లోనూ అదే చెప్పారు. ఇప్పుడు మేమంత సిద్ధం యాత్రలో కూడా అదే చేస్తున్నారు. ప్రభుత్వ మీటింగ్ అయినా.. పార్టీ మీటింగ్ అయినా.. ఎన్నికల సభ అయితా ఒకటే రోత. అందుకే ప్రజలు జగన్ స్పీచ్ వినలేక విసుక్కుంటున్నారు. పైగా అన్ని అబద్దాలే చెబుతున్నారు. అభివృద్ది అంటారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -