YS Jagan: సీమలోనూ జగన్ కు షాకులు తప్పవట.. అక్కడ జగన్ కు విజయావకాశాలు లేనట్టేనా?

YS Jagan: ఏపీలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. పైగా వైసీపీకి కంచుకోట లాంటి రాయలసీమలో సీన్ రివర్స్ అవుతుంది. గత ఎన్నికల్లో రాయలసీమలో 49 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. కడప, కర్నూలు జిల్లాలను వైసీపీ స్వీప్ చేసింది. అనంతపురంలో రెండు స్థానాలు, చిత్తూరులో ఒక స్థానం మాత్రమే టీడీపీ ఖాతాలో పడ్డాయి. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో మాత్రం టీడీపీ గెలిచింది. అది కూడా అక్కడ టీడీపీ మెజారిటీ బాగా తగ్గిపోయింది. ఇక అనంతపురం జిల్లా ఎప్పుడూ టీడీపీకి కంచుకోటలా ఉండేది. అలాంటి అనంతపురం జిల్లాలో బాలకృష్ణ, పయ్యావుల కేశవులు మాత్రమే గెలిచారు. మిగిలిన స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. కానీ, ఐదేళ్ల అయ్యేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. రాయలసీమ ఎప్పుడూ టీడీపీకి ఫేవర్ గా లేదు.

అధికారంలోకి వచ్చినపుడు కూడా టీడీపీ అక్కడ అతి తక్కువ స్థానాలతో సరిపెట్టుకునేది. కానీ, ఇప్పుడు మాత్రం వైసీపీకి టీడీపీ సవాల్ విసురుతుంది. రాయలసీమ నాలుగు జిల్లాల్లో 20 నుంచి 25 స్థానాల్లో గెలుపు ఖాయంగా సర్వేలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలో మరోసారి టీడీపీ పట్టు నిలబెట్టుకుంటుందని చర్చ జరుగుతోంది. మెజార్టీ స్థానాలు ఇక్కడ టీడీపీ ఖాతాలోకి పడతాయని చర్చ నడుస్తోంది. అటు.. చిత్తూరు జిల్లాలో పోరు హోరాహోరీగా ఉంటుంది. ఇక్కడు పార్టీలు చెరో సగం సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది. ఇక, కడపలో వైసీపీ సత్తా చాటినా.. కర్నూల్ లో మాత్రం అధికార పార్టీకి ఎదురీత తప్పదని చెబుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఒక్కో జిల్లాలో ఒక్కో కారణం కనిపిస్తుంది.

అనంతపురం జిల్లాలో అభివృద్దే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. టీడీపీ హయాంలో అక్కడ కియా మోటార్స్ కంపెనీ వచ్చింది. దీంతో.. అనంతపురానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కంపెనీ కూడా రాలేదు. పైగా ఉన్న కియో మోటార్స్ యాజమాన్యంపై బెదిరింపులకు దిగుతూ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆ ప్రభావం ప్రభుత్వంపై పడింది. ఇక.. తిరుపతిలో అన్యమత ప్రచారం చిత్తూరు జిల్లాలో ప్రభావం చూపించింది. దానికి తోడు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కూడా జిల్లాలో తారా స్థాయికి చేరుకుంది.
కడప, కర్నూల్ లో వివేకాహత్య కేసు ప్రభావం బలంగా కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో కర్నూల్ ఓ వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా.. ఈ సారి ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధిక్యంలో ఉందని స్ట్రా పోల్ సంస్థ తెలిపింది. మేమంతా సిద్దం సభలతో జగన్ జనంలోకి వెళ్తున్నారు కానీ.. ప్రజలు మాత్రం సభలకు పెద్దగా హాజరుకావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా గాలి కూటమి వైపు వీయడంతో.. బలంగా ఉన్న రాయలసీమలో కూడా వైసీపీ నేతలు టీడీపీలో చేరిపోతున్నారు. పార్టీ వీక్ అవ్వడానికి ఇదో కారణంగా చెప్పొచ్చు. రాయలసీమలో వివేకాహత్య కేసు వైసీపీకి పెద్ద మైనస్ అని చెప్పాలి. జగన్ ఈ హత్య చేయించాడని ప్రజలు నమ్మడం లేదు కానీ.. హత్య కేసు నిందితులను కాపాడుతున్నాడని బలంగా నమ్ముతున్నారు. ఢిల్లీలో కాళ్లు అరిగేలా న్యాయం కోసం తిరుగుతున్న వైఎస్ సునీతపై తప్పుడు వార్తలు రాయడం కూడా సీమ ప్రజలకు రుచించడం లేదు. అవినాష్ రెడ్డి ఈ హత్య చేయించాడని సీబీఐ చెబుతున్నా… ఆయన్ని వెనకేసుకొని రావడమే వైసీపీకి మైనస్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -