Vision Visakha: దిగిపోయే ముందు విజన్ విశాఖ.. ఏపీ సీఎం జగన్ మూర్ఖత్వానికి ఎవరూ సాటిరారుగా!

Vision Visakha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని గాలికి వదిలేశారు. కేవలం సంక్షేమ పథకాలు అందిస్తేనే అభివృద్ధి అనే ధోరణిలో ఈయన ఉన్నారు. అయితే ఇన్ని రోజులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామంటూ గొప్పలు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వచ్చే సమయానికి కాస్త ఓటమి భయం పట్టుకుందని తెలుస్తుంది.

ఇప్పటికే ఎన్నో సర్వేలు జగన్ కి వ్యతిరేకంగా వస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి విజయం ఖాయమని చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ సైతం ఈసారి వైసీపీ గెలవడం చాలా కష్టమని తేల్చి చెప్పారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున వైయస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కూడా వెళ్తుండటం జగన్ ఓటమికి సంకేతం అని చెప్పాలి.

ఇక నాలుగు సంవత్సరాల పాటు సమయాన్ని వృధా చేసినటువంటి ఈయన విజన్ విశాఖ అంటూ తాజాగా ఎన్నికల ముందు సరికొత్త హడావిడి మొదలు పెట్టారు. విశాఖ నగరంలో వైజాగ్‌ విజన్‌-ఫ్యూచర్‌ విశాఖ పేరుతో మంగళ, బుధవారం సదస్సు నిర్వహించబోతోంది.సదస్సులో సిఎం జగన్మోహన్‌ రెడ్డి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులకు రాష్ట్రాభివృద్ధి, విశాఖలో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి గల అవకాశాల వివరించి, విశాఖను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో తోడ్పడాలని ఆకాంక్షిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయన ఏదో మంచి చేస్తారని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారంటూ ఈయనకు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అప్పులు పాలు చేయడమే కాకుండా అభివృద్ధిని గాలికి వదిలేసారు ఎన్నికలు మరొక నెలలో జరగబోతున్నాయన్న నేపథ్యంలో ఈయన విజన్ విశాఖ అంటూ పెద్ద ఎత్తున డ్రామాలు ప్లే చేస్తున్నారని ఈ సదస్సు పేరిట తిరిగి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -