YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కామెడీ అయిపోతున్న షర్మిల.. ఆమె సభలను ఎవరూ పట్టించుకోవట్లేదా?

YS Sharmila: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం సంచలనగా మారాయి ఒకవైపు కూటమి మరోవైపు జగన్ పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఉండగా మధ్యలో షర్మిల నేను కూడా పోటీకి సై అంటూ పెద్ద ఎత్తున కామెడీ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పాలి. మొన్నటి వరకు తెలంగాణలో తన రాజకీయాలతో రచ్చ చేసినటువంటి షర్మిల ఇప్పుడు తెలంగాణలో తన రాజకీయ పార్టీ సర్దుకొని ఏపీలోకి వచ్చారు ఇక్కడ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నటువంటి ఈమె తరచూ తన అన్న ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తున్నారు.

తెలంగాణలో తన మాట తీరుతో నవ్వులు పాలు అయినటువంటి ఈమె ఇక్కడ కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈమె పెద్ద ఎత్తున సభలను నిర్వహిస్తూ తన చిన్నాన్న హత్య కేసు గురించే మాట్లాడుతున్నారు అవినాష్ హంతకుడు అంటూ చెబుతున్నారు కోర్టులో ఉన్నటువంటి కేసు గురించి షర్మిల ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.

ఇలా ఈమె తన బాబాయ్ హత్య కేసును అడ్డుగా పెట్టుకొని చేస్తున్నటువంటి రాజకీయాలు అందరికీ హాస్యాస్పదంగా మారాయి తప్ప నిజంగానే తన హత్య వెనక ఇంత కుట్ర జరిగిందన్న ఆలోచన ఎవరికీ మాత్రం రాలేదని చెప్పాలి. ఇక షర్మిల మాట్లాడే మాటలు ఏకంగా సినిమాలలో కూడా కామెడీ డైలాగులుగా పెట్టుకోవడం అంటే ఈమె ఏ స్థాయికి దిగజారిపోయారో తెలుస్తుంది.

పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్రని ఆడపిల్ల అంటే ఆడపిల్ల కానీ ఈడపిల్ల కాదు అంటూ షర్మిల మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ కి గురయ్యాయి. ఇకపోతే తాజాగా షర్మిల ఏపీలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే మాట్లాడటంతో ఈమెను ఒక కమెడియన్ గా చూస్తున్నారు తప్ప తన వ్యాఖ్యలను ఎవరూ కూడా పట్టించుకోవడంలేదని చెప్పాలి. ఇక కడపలో తన అన్న పైన పోటీకి దిగినటువంటి ఈమె అక్కడ డిపాజిట్లు కోల్పోతారు అనేది స్పష్టంగా తెలుసు మరి డిపాజిట్లు కోల్పోయిన తర్వాత ఏ విధంగా ప్రజలకు మొహం చూపిస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -