YS Sharmila: జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్న వైఎస్ షర్మిల.. పొలిటికల్ కెరీర్ సర్వనాశనమేనా?

YS Sharmila: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు , వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. తెలంగాణలో వైఎస్ఆర్ వారసత్వపు రాజకీయ ముద్ర చూపించాలి అన్న ఆశతో ఎన్నో కష్టాలను ఎదుర్కొని సొంతంగా ఒక పార్టీని స్థాపించింది షర్మిల. అయితే వైసీపీ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని అనుకున్న ఆమె ఆలోచన ఆమెకు లాభం చేస్తుందా? లేక చేటు చేస్తుందా? అనే చర్చ ప్రస్తుతం రాజకీయల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆమె తెలంగాణలో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చి నిరుద్యోగులకు మేలు చేస్తాను అంటూ పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికింది.

కానీ వాస్తవంలోకి వచ్చేసరికి అవన్నీ కూడా గాలి మాటలుగా తేలిపోయాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి వారు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారా? అని ఆమె ఇప్పుడు నిరీక్షిస్తున్నారు. ఒక రకంగా చూసినప్పుడు ఇది కాంగ్రెస్ మైండ్ గేమ్ అనిపిస్తుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ను రెండు మూడు పర్యాయాలు కలవడం ద్వారా షర్మిల విలీనం కాబోతున్నదనే వార్తలు పుట్టాయి. నిజానికి డికెతో భేటీ అనేది వార్తల రూపంలో బయటకు పొక్కకుండా దాచి ఉంచడం షర్మిలకు పెద్ద విషయం కాదు. కానీ ఆమె ఆ జాగ్రత్త తీసుకోలేదు. ఢిల్లీ వెళ్లి సోనియా రాహుల్ లతో భేటీ కోసం అవస్థలు పడడం వారి ఇంటి ఆవరణలో తచ్చట్లాడడం అన్నీ మీడియాలో వచ్చాయి. వారిద్దరినీ కలిసిన తర్వాత కూడా ఇప్పటిదాకా ముహూర్తం తేలకపోవడం ఏమిటి? ఇవన్నీ చూస్తుంటే షర్మిల సొంత పార్టీని నడపలేకపోతున్నది.

అందుకే విలీనానికి వెంపర్లాడుతున్నది..అనే స్పష్టమైన సంకేతాలను కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఇప్పుడిక ముహూర్తం తేల్చకుండా నాన్చుతున్నది! అయితే ఈ గ్యాప్ లో తన పార్టీ కార్యకలాపాలు వదిలేయడం ద్వారా షర్మిల తప్పు చేసిందనే అనుకోవాలి. మొత్తానికి ప్రస్తుతం షర్మిల పరిస్థితి చూస్తుంటే జీవితంలో మళ్ళీ కోలుకోలేని విధంగా ఆమె తప్పు ఇస్తోంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తప్పులు ఆమె పొలిటికల్ జీవితాన్ని సర్వనాశనం చేస్తా ఈ అన్న అనుమానాలు కూడా రాక మానదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -