YS Sharmila: షర్మిలకు భయం మొదలైందా.. ఆమెకు మిగిలిన చివరి ఆశ మాత్రం ఇదేనా?

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమింపబడ్డారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈమె స్వయంగా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇలా జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడమే కాకుండా ఏకంగా కడప ఎంపీగా పోటీ చేస్తూ తన అన్నకు గట్టి పోటీ ఇస్తున్నారు.

వైయస్ కుటుంబానికి కంచు కోటుగా ఉన్నటువంటి కడపలో ఈమె కాంగ్రెస్ పార్టీలోకి చేరి తన అన్నపై విజయం సాధించాలి అంటే మామూలు విషయం కాదు కానీ షర్మిల ఆ సాహసమే చేశారని చెప్పాలి అయితే ఈమె ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి సమయంలో తన అన్నయ్య జగన్ కి వస్తున్నటువంటి ఆదరణ చూసి షర్మిల కాస్త వెనకడుగు వేస్తున్నారని తెలుస్తుంది.

స్వయంగా కడప జిల్లాలో ఎంతోమంది షర్మిల ఎదురగే జగన్ చేసిన మంచి పనులను అభివృద్ధిని పొగుడుతూ ఉండడంతో కడపలో తన అన్న పై గెలవడం కష్టమని షర్మిల భావించారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడప్పుడే అధికారం అందుకోవాలి అంటే కష్టతరమని భావించినటువంటి ఈమె తన రాజకీయ భవిష్యత్తు తేల్చుకోవడం కోసం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె శివకుమార్ గారితో భేటీ అయ్యారు.

కేంద్రంలో కూడా ఇప్పుడప్పుడే కాంగ్రెస్ వచ్చే పరిస్థితులు లేవు అలాగే ఏపీలో కూడా కాంగ్రెస్ వచ్చే పరిస్థితులు లేవు ఇలాంటి తరుణంలో తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తన రాజకీయ ప్రయాణం ఎటువైపు తేల్చుకోవడం కోసం ఈమె బెంగళూరు వెళ్లి శివకుమార్ ని కలిశారు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు అలాగే ఏపీలో కూడా అలాంటి పరిస్థితులు లేవు ఇలాంటి తరుణంలోని తన పరిస్థితి ఏంటని ఈమె ప్రశ్నించారు అయితే ఈమెను తీసేసి అధ్యక్షురాలు చేయడం కంటే ముందుగానే ఈమెను రాజ్యసభకు పంపిస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందిగా ఈమె ఇటీవల భేటీలో శివకుమార్ తో చర్చించినట్టు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -