YS Sharmila: తల్లి కోసం త్యాగం చేస్తున్న వైఎస్ షర్మిల.. నిజంగా ఆమె మనస్సు మంచి మనస్సు అంటూ?

YS Sharmila: మొత్తానికి షర్మిల ఒంటరి పోరు ప్రారంభించింది, ఆమె డిమాండ్లకు కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. ఎందుకు తల్లి విజయమ్మ సపోర్టు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వైయస్ విజయమ్మ మరొకసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు, అయితే ఈసారి ఏపి నుంచి కాకుండా తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడింది షర్మిల.

కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనం ప్రతిపాదన వర్కౌట్ కాకపోవటంతో తనతో పాటు తల్లి, మిగిలిన అభ్యర్థులను పోటీకి దించేందుకు షర్మిల సిద్ధం అయ్యారు. అందులో భాగంగా విజయమ్మకు స్థానం ఖరారు చేశారు. తొలి జాబితాను విడుదల చేసేందుకు షర్మిల కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం ఇందులో భాగంగా తనతో పాటు తల్లిని ఎన్నికల బరిలో దించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వైయస్సార్ మరణం తర్వాత విజయమ్మ పులివెందుల నుంచి ఏకగ్రీవంగా ఏపీ ఉమ్మడి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత జగన్ కొత్త పార్టీ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ కి రాజీనామా చేసి వైసీపీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తొలి ఎమ్మెల్యేగా విజయమ్మ నిలిచారు. ఆ సమయంలో కడప నుంచి జగన్ రికార్డు స్థాయి మెజార్టీతో లోక్ సభకు ఎన్నికయ్యారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. కుమార్తె షర్మిల తో కలిసి అప్పుడప్పుడు సభల్లో పాల్గొన్నారు.

ఇక ఇప్పుడు తెలంగాణలో ఒంటరిగానే వైఎస్ఆర్టిపి ఎన్నికల పోరుకు సిద్ధం అయింది షర్మిల. తన తల్లి కోసం షర్మిల పాలేరు స్థానాన్ని త్యాగం చేసినట్లు సమాచారం. పాలేరు నుంచి విజయమ్మ పోటీ చేయనున్నారట, షర్మిల మాత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి పోటీ చేయబోతున్నట్లు సమాచారం. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను నేడు లేదంటే ఈనెల 17, 18న ప్రకటిస్తారు. ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ సమావేశం తర్వాత తెలంగాణలో పోటీపై షర్మిల ప్రకటన చేసే వీలుంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -