YS Sharmila: షర్మిల రాజకీయ జీవితం ముగిసినట్లేనా.. ఆమె తన గొయ్యిని తానే తవ్వుకుందంటూ?

YS Sharmila: షర్మిల రాజకీయపరంగా తప్పటడుగు వేసిందా, కాంగ్రెసులో తన పార్టీని విలీనం చేయాలనుకుని తన పతనాన్ని తానే కొని తెచ్చుకుందా.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలవారు. పార్టీ పెట్టి వైయస్సార్ వారసురాలిగా ఆయన హవా కొనసాగిస్తాను అని చెప్పిన షర్మిల ప్రయాణం ప్రారంభించక ముందే ముగించేస్తారని ఎవరు అనుకోలేదు. తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయితే ఏపీలో జగన్ కి పోటీ ఇద్దాం అనుకుంది షర్మిల.

అదే కనుక జరిగితే జగన్ పరువు కూడా పోతుంది అని ఊహాగానాలు కూడా చేశారు రాజకీయ వర్గాల వారు. కానీ షర్మిల ప్రస్తుత పరిస్థితి చూసి ఆవిడ ఫ్యాన్స్ సైతం జాలి చూపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి ఒప్పుకొని చర్చలు జరిపారు షర్మిల. కానీ ఆమెని పార్టీలో చేర్చుకోవడం కోసం తెలంగాణ నేతలు ఎవరూ రెడీగా లేరు. ఆమె పార్టీలో అడుగుపెట్టడం వలన కొత్తగా వచ్చే ఉపయోగం ఏమీ లేదు సరి కదా ఉన్న హవా కూడా తగ్గిపోతుంది అన్నట్లుగా తేల్చి చెప్పేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

దీంతో కాంగ్రెస్ హై కమాండ్ ఆమె పోటీపై ఏమీ మాట్లాడడం లేదు. పాలేరు నుంచి పోటీ చేస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పిన షర్మిల ఇప్పుడు తర్వాత చెప్తాను అంటున్నారు. రేణుక చౌదరి వంటి రాజకీయ నాయకులు సైతం షర్మిలపై మండిపడుతున్నారు. ఈ వ్యతిరేకతను ఊహించని హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతుంది. అలా అని తన పార్టీని బేషరతుగా కాంగ్రెస్లో విలీనం చేస్తే అది రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవటమే. ఇది నిజంగా షర్మిలకు సంకట పరిస్థితి. తను పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టింది.

అలాగే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెచ్చుకున్న ప్రజాదరణ కూడా ఇప్పుడు ఆమెకి లేకుండా పోయి తన గొయ్యి తానే తవ్వుకున్నట్లయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా ఉంటే కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి షర్మిలది. ఇక్కడ తప్పు షర్మిల నిర్ణయంలో ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ ప్లానా లేదా జగన్ ప్లానా అనేది పక్కన పెడితే ఇలాంటి కుతంత్రాలని తట్టుకుంటేనే రాజకీయాలలో సమర్థంగా ఎదుర్కొంటారు. మరి షర్మిల గొప్పగా కం బ్యాక్ ఇస్తుందా లేదంటే రాజకీయ వ్యూహాత్మక దాడికి బలవుతారా అన్నది వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -