YS Vijayamma: కొడుకు కోసం కూతురుకు అన్యాయం చేస్తున్న విజయమ్మ.. షర్మిల పొలిటికల్ గా ఎదగలేదనే అలా చేశారా?

YS Vijayamma: ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్వీస్ట్ జరిగింది. షర్మిల కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జగన్ చేసిన ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి. అదే.. వైఎస్ విజయలక్ష్మి తన కుమారుడు వైఎస్ జగన్ కు మద్దతు పలకడం. జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర మొదలు పెట్టారు. ఇడుపుల పాయలో తండ్రి సమాధి దగ్గర ప్రత్యేకప్రార్థనలు చేశారు. అక్కడ సడెన్ గా విజయమ్మ ప్రత్యక్షం అయ్యారు. కొడుకును ఆప్యాయంగా పలకరించి.. హత్తుకొని యాత్ర విజయవంతం కావాలని ఆశీర్వదించారు. ఇది చూసిన ప్రజలకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది. కానీ, ఎంతైనా తల్లి కదా. ఆ మాత్రం ప్రేమ చూపిస్తుంది. అయితే, ఇక్కడ మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జగన్ వియమ్మను బలవంతంగా పార్టీ నుంచి గెంటేశారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. గెంటేసినా కొడుకే కదా అనుకొని తల్లి రావొచ్చు. కానీ, ఇక్కడ జగన్ షర్మిలకు కూడా అన్యాయం చేశాడు. పార్టీలో రాజకీయంగా ఎదగనివ్వలేదు. తండ్రి ఆస్థిలో కూడా వాటా ఇవ్వలేదు. ఈ విషయంలోనే షర్మిల, జగన్ రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. మరి ఇప్పుడు విజయమ్మ జగన్ కు మద్దతిస్తే.. షర్మిలకు న్యాయం ఎవరు చేస్తారా? కుమార్తెకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు అని విజయమ్మ అనుకున్నారా? ఒకవేళ అదే నిజం అయితే.. చెల్లెలుకు న్యాయం చేయలేని కొడుకు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని అనుకున్నారా? దీనికి విజయమ్మ సమాధానం చెప్పాలి.

షర్మిల ఏపీలో రాజకీయాల్లో ప్రధాన అస్త్రంగా వివేకాహత్య కేసును ప్రయోగిస్తున్నారు. జగన్ హంతకులను కాపాడుతున్నారని ఆమె విమర్శిస్తున్నారు. షర్మిల ఆరోపణలు అబద్దం అని విజయమ్మ చెప్పాలి అనుకుంటున్నారా? హంతకుల వెనక జగన్ ఉన్నారు లేదా షర్మిల.. జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఏదో ఒక విషయాన్ని విజయమ్మ చెప్పాలి. ఇంతవరకూ ఆమె బయటకు రాలేదు కనుక ఈ ప్రశ్న ఉత్పన్నం కాలేదు. కానీ, ఇప్పుడు కుమార్తెను కాదని కొడుకుకే మద్దతు ఇచ్చారు కనుక ఈ విషయంలో ఓ క్లారిటీ ఇవ్వాలి. లేదంటే ప్రజలు జగన్, షర్మిలను కంటే మొదటి విజయమ్మనే తప్పు పట్టే ప్రమాదం ఉంది.

విజయమ్మ కూడా వ్యూహాత్మకంగా ఆలోచించి ఉండొచ్చు. కుమార్తె ఎంత ప్రయత్నించినా ఇప్పటికి ఇప్పుడే రాజకీయంగా ఎదగడం కష్టం. ఎందుకుంటే షర్మిల కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ బలపడాలంటే కనీసం మరో పదేళ్లు సమయం పడుతుంది. ఇప్పుడు కుమార్తెకు మద్దతు పలికినా ప్రయోజనం ఉండదు. షర్మిలకు మద్దతిస్తే.. జగన్ రాజకీయంగా నష్టపోతాడు. అందుకే.. జగన్ చెంతకు చేరి ఉండొచ్చు. కానీ, చాలా ప్రశ్నలకు మాత్రం ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -