YS Jagan: వివేకా హత్య గురించి జగన్ కు ముందే తెలుసా.. ఎన్నికల ముందు ఏపీ సీఎంకు ఈ షాకులేంటో?

YS Jagan: వైసీపీ శిబిరంలో వివేకాహత్య కేసు ప్రకంపనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడం.. ఎన్నికలు దగ్గర పడటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా రాయలసీమలో వివేకాహత్య అంశం చర్చకు వస్తుంది. నేటికి వివేకానంద రెడ్డి హత్యకు గురై ఐదేళ్లు అవుతోంది. దీంతో… వివేకా భార్య సౌభాగ్యమ్మ ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హత్యకు సంబంధించి సంచలన విషయాలను తెలిపారు. జగన్ ప్రభుత్వ తీరుపై ఘాటు విరమ్శలు చేశారు.

ఇటీవల ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి వైసీపీకి ఓటు వేయొద్దని వైఎస్ సునీత పిలుపునిచ్చారు. సునీత పిలుపుతో తాను కూడా ఏకీభవిస్తున్నానని సౌభాగ్యమ్మ చెప్పారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని ఆమె విమర్శించారు. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారని ఇప్పుడిప్పుడే అర్థం అవుతోందని ఆమె అనుమానించారు. తన భర్త హత్య గురించి పులివెందులలో తెలిసే లోపే జగన్‌కు, ఆయన భార్య భారతీకి తెలిసిందనే అనుమానం ఆమె వ్యక్తం చేశారు. తెలిసినప్పటికీ.. సాయంత్రం వరకూ జగన్ పులివెందుల ఎందుకు రాలేదని సౌభాగ్యమ్మ ప్రశ్నించారు.

వివేకా చనిపోయిన తర్వాత సీబీఐ విచారణ కోరిన జగన్.. సీఎం అయిన తర్వాత మాత్రం కేసును పట్టించుకోలేదని మండిపడ్డారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి తప్పించుకు తిరగడానికి జగన్ అండదండలున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈకేసు జగన్ తమకు న్యాయం చేయాల్సింది పోయి.. తిరిగి తన కుమార్తె, అల్లుడుపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అండ లేకపోవడంతోనే తాము న్యాయ పోరాటానికి సిద్ధమయ్యామని ఆమె తెలిపారు. సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసే చివరి క్షణంలో కూడా సునీత జగన్ దగ్గరకు వెళ్లి కలిసిందని.. కానీ.. జగన్ ఆమెను పట్టించుకోదని సౌభాగ్యమ్మ ద్వజమెత్తారు. న్యాయ పోరాటం మొదలు పెట్టినప్పటి నుంచి సునీతను వైసీసీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ వైపు తన భర్త కోల్పోయాననే బాధ, మరోవైపు న్యాయం కోసం బిడ్డ పడుతున్న కష్టం చూసి కుమిలిపోతున్నానని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. అయితే.. పెద్ద పెద్ద శక్తులను ఎదురొడ్డి దైర్యంగా పోరాటం చేస్తున్న సునీతను చూస్తే గర్వంగా ఉందని అన్నారు. ఎప్పటికైనా న్యాయం, నిజం గెలుస్తుందని ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి రామలక్ష్మణుల్లా ఉండేవారని చెప్పారు. వైఎస్ఆర్ ఉన్నపుడు ఎలాంటి ఇబ్బందులు లేవని.. వైఎస్ చనిపోయిన తర్వాత కుటుంబ కలహాలు మొదలయ్యాయని చెప్పారు. వివేకానంద రెడ్డికి లభించిన ఆదరణ తట్టుకోలేక కొందరు కుట్రలు ప్రారంభించారని అన్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీగా ఆయన్ని ఓడించారని చెప్పారు. ఇలా ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ ను సీఎంగా చూడటమే ఆయన లక్ష్యంగా వివేకానందరెడ్డి పని చేశారని అన్నారు.

ఓ కుటుంబంలో ఉన్న కలహాలే అనుకున్నాం కానీ.. హత్య చేసేందుకు బరితెగిస్తారన అనుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి శత్రువును గుర్తించ లేకపోయామని నిట్టూర్చారు. రాయలసీమలో హత్యల గురించి వినేవాళ్లమని.. వైఎస్, వివేకా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం నెలకొందని చెప్పారు. కానీ.. చివరికి తమ ఇంట్లోనే హత్య జరుగుతుందని ఊహించలేదని వివేకా భార్య తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఆమె విమర్శించారు. వర్ధంతి కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి పులివెందులలో పంక్షన్ హాల్ కూడా దొరక్కుండా చేశారని మండిపడ్డారు. చివరికి కడప వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. జగన్ సీఎం అయిన తర్వాత ప్రజా భవన్ కూల్చివేతతోనే ఆయన పాలనపై ఓ అంచనాకు వచ్చానని సౌభాగ్యమ్మ చెప్పారు. రాష్ట్రాని మంచి నాయకుడు కావాలని ఆమె అన్నారు. అందుకే వైసీపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -