Dastagiri: వివేకాను చంపిందెవరో చెప్పి వైసీపీ ఓట్లు అడగాలి.. దస్తగిరి ప్రశ్నలకు సమాధానం ఉందా?

Dastagiri: ఏపీలో గత ఎన్నికల ముందు జరిగిన వివేకానంద రెడ్డి హత్య వైసీపీ గెలుపునకు కారణమైంది. అయితే, ఇప్పుడు అదే అంశం జగన్ కు తలనొప్పులు తెచ్చి పెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివేకాహత్య కేసు ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు కానీ.. రాయలసీమ మరీ ముఖ్యంగా కడపలో దాని ప్రభావం బలంగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ హత్యను చంద్రబాబు చేయించారని సానుబూతి ఓట్లు పొందిన జగన్.. రెండేళ్లుగా చంద్రబాబు మాటే ఎత్తడం లేదు. వైఎస్ సునీత, తన భర్త ఈ హత్య చేయించారని సొంత పత్రికలో కథనాలు రాయిస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుపై బురద చల్లారు. దాని వలన టీడీపీకి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారో జగన్ చెప్పాలి.

ఇప్పుడు సునీత, తన భర్తపై బురద చల్లుతున్నారు. కానీ, సునీత దంపతులు మాత్రం ఏమాత్రం తగ్గకుండా వివేకాహత్య అంశంలో తమకు న్యాయం చేయాలని సీబీఐ చుట్టూ తిరుగుతున్నారు. ఓ వైపు సునీత న్యాయపోరాటం చేస్తుంటే.. మరోవైపు జగన్‌పై షర్మిల రాజకీయపోరాటం చేస్తున్నారు. అంతేకాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బంధు వర్గం మొత్తం జగన్‌కు వ్యతిరేకమైంది. ఇంత జరుగుతున్నా వైఎస్ భార్య విజయమ్మ మౌనంగానే ఉన్నారు. ఇవన్నీ ఓ ఎత్తు అయితే.. వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఎపిసోడ్ మరో ఎత్తులా మారింది. అట్రాసిటీ, దాడి కేసులో నాలుగు నెలలు పాటు కడప జైల్లో ఉన్న దస్తగిరి శుక్రవారం బెయిల్ పై విడుదలైయ్యారు. జైలు నుంచి వచ్చిన దస్తగిరి.. సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కడప జైల్లో తనను వివేకా హత్యకేసు నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి తనకు కలిశాడని చెప్పాడు. డబ్బు ఆశ చూపి రాజీకి రావాలని అభ్యర్థించాడని దస్తగిరి తెలిపాడు. అయితే, వివేకా హత్యకు సంబంధించి తప్పు చేసి ప్రాయశ్చిత్తంతో ఉన్నారని.. మరోసారి అలాంటి తప్పు చేయనని అన్నాడు. అంతేకాదు.. సీబీఐ ఎస్సీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. వారి ప్రలోభాలకు, బెదిరింపులకు భయపడేది లేదని దస్తగిరి తేల్చి చెప్పాడు. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే తన ఇల్లు ఉందని.. తనపై దాడి జరగొచ్చని.. కానీ భయపడనని చెప్పారు. చావడానికైనా సిద్దంగా ఉంటా కానీ.. జగన్, అవినాష్ మాటలు వినే ప్రసక్తిలేదని తేల్చి చెప్పారు.

వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ గా మారానని తనపై అట్రాసిటి, దాడి కేసు పెట్టి జైల్లో పెట్టారని ఆరోపించారు. జగన్, అవినాష్‌కు దమ్ముంటే వివేకాను ఎవరు చంపారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. పులివెందులలో వాళ్లు ఓట్లు అడిగితే జనం రాళ్లతో కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దం సభలు నిర్వహిస్తున్న జగన్.. అదే సభల్లో వివేకాను ఎవరు చంపారో చెబితే బాగుండేదని అన్నారు. శుక్రవారం బెయిల్‌పై విడుదలైన దస్తగిరి భారీ పోలీస్ బందోబస్తుతో పులివెందుల వెళ్లారు. ఎన్నికల ముందు దస్తగిరి చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అంతేకాదు. ఆయన డైరెక్ట్‌గా సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై కామెంట్స్ చేయడం సంచలనంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -