YSR Asara Scheme: నేడే వైఎస్సార్ ఆసరా స్కీమ్ నిధులు విడుదల.. వాళ్లకు బెనిఫిట్ అంటూ?

YSR Asara Scheme: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసింది. అమ్మ ఒడి, రైతు భరోసా, పసుపు కుంకుమ, సున్నా వడ్డీ, వసతి దీవెన, ఈ బీసీ నేస్తం, కాపు నేస్తం, చేయూత అంటూ ఇలా ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టారు. ఇప్పటికే విడుదలవారీగా ప్రజలకు డబ్బును అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని డ్వాక్రా మహిళలకు జగన్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇది ఇలాంటి 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల పేరుతో ఉండే రుణాల మొత్తాన్ని నాలుగు దఫాలో నేరుగా వారి చేతికి అందిస్తాము అని చెప్పిన విషయం తెలిసిందే.

వైయస్సార్ ఆసరా పథకం ద్వారా మూడో విడత సహాయాన్ని తాజాగా అనగా నేడు శనివారం విడుదల చేయనున్న సందర్భంగా పాస్టర్ వ్యాప్తంగా 78.94 లక్షల మంది మహిళల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాశారు. పది రోజులపాటు జరిగే ఆసరా పంపిణీ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు సీఎం లేఖలను నేరుగా అందజేస్తారు అని అధికారులు తెలిపారు. అక్క వాళ్ళ చెల్లెమ్మలకు అందజేస్తున్న ఈ మొత్తాన్ని వారు ఎందుకు వినియోగించుకుంటారు ఎలా వినియోగించుకుంటారు అన్న అంశంపై ఎటువంటి షరతులు లేవు.

 

వైసీపీ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ ఆదాయాలను పెంచుకొని మీరు సంతోషంగా ఉండాలి. మీ కుటుంబ ఆదాయం పెరగడం వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది అని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఎన్ని సమస్యలు వచ్చినా భరిస్తూ ఇచ్చిన మాట మేరకు మీ తోబుట్టుగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాను. జగనన్న పాలనలో రాజన్న రాజ్యం చూడాలన్న మీ కోరిక నెరవేర్చి దిశగా నా ప్రతి అడుగు వేస్తున్నాను. అందరి ఆశీస్సులు నాతోపాటే ఉంటాయన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నాను అని తెలిపారు జగన్మోహన్ రెడ్డి.

 

మెనీ ఫెస్టోలో ఇచ్చిన హామీని అక్షరాల పాటిస్తూ ఇప్పటికే మొదటి విడతగా రూ. 6,318.76 కోట్లు చెల్లించాము. రెండవ విడతగా 78.76 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రూ. 6,439.52 కోట్ల రూపాయలను చెల్లించాము. ఇప్పుడు మూడవ విడతగా అక్క చెల్లెమ్మలకు మరో రూ.6,419.89 కోట్లు అందజేయను ఉన్నాము అని తెలిపారు. అలా మూడు విడతలతో మొత్తంగా రూ. 19,178.17 కోట్లను 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు అందించినట్టు తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

TV Channels: టీవీ9, ఎన్టీవీ నంబర్ 1 కొట్లాట.. ఏది టాప్ అంటే?

TV Channels: తెలుగు న్యూస్ ఛానల్ మధ్య నెంబర్ గేమ్ నడుస్తుంది. పలు న్యూస్ ఛానల్ మేము నెంబర్ వన్ అంటే మేము నెంబర్ వన్ అని కొట్లాడుకుంటున్నారు. తెలుగు న్యూస్ చానల్స్...
- Advertisement -
- Advertisement -