YCP Candidates: ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి టికెట్లు.. వైసీపీకి అభ్యర్థుల ఎంపిక కూడా చేత కాలేదా?

YCP Candidates: జగన్ జగమొండి.. ఆయన ఎవరి మాట వినరు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతారనేది నిన్నటి మాట. ఇప్పుడు పరిస్థితి మారింది. అన్నీ అనుకూలంగా ఉంటే ఎవరైనా సరే నచ్చిన్టటు దూసుకుపోతారు. కానీ.. తేడా కొడితే ఒత్తిళ్లకు లోను కాక తప్పదు. ఇప్పుడు వైసీపీ చివరి జాబితా చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతోంది.

సిట్టింగుల్లో రిజర్వుడు స్థానాల్లో నేతలపై ప్రతాపం చూపించిన జగన్.. సొంత సామాజిక వర్గం నేతల దగ్గర తలొగ్గాల్సివచ్చింది. టికెట్ వస్తుందో రాదో తెలియదు అనుకున్న సిట్టింగ్ రెడ్లకు మళ్లీ టికెట్లు వచ్చాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల స్థానాలు మాత్రం మార్చలేదు. పార్టీలో ఎవరికైతే సీటు రాదు.. రాకూడదని ఇంటా బయట నిరసనలు హోరెత్తాయో జగన్ వారికే సీట్లు కేటాయించారు. రోజాకి జగన్ గుడ్ బై చెబుతారని అంతా అనుకున్నారు. కానీ.. మళ్లీ ఆమెకు టికెట్ ఇచ్చారు. ఇలా చూసుకుంటే చాలానే ఉన్నాయి. అంతేకాదు.. పార్టీలోని సీనియర్లను ఒత్తిళ్లకు తలొగ్గాల్సివచ్చి వారికి ఫ్యామిలీ ప్యాకేజీలు ప్రకటించారు. మంత్రి బొత్స,పెద్దిరెడ్డి, బాలనాగిరెడ్డి కుటుంబాలకు ఏకంగా మూడేసి చెప్పున టికెట్లు ప్రకటించారు. అటు.. ఆదిమూలపు, ధర్మాన, చెవిరెడ్డి ఫ్యామిలీకు రెండు చెప్పొన టికెట్లు దక్కాయి. ఆయా నాయకులు జగన్ ను ఎంత ప్రభావింత చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

మంత్రి బొత్స చీపురుపల్లి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన భార్య బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా బరిలో దిగుతున్నారు. ఇక.. బొత్స బంధువు బొత్స అప్పల నరసయ్య గజపతి నగరం నుంచి ఎమ్మెల్యేగా రంగంలో దిగుతున్నారు. ఇక మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పుంగనూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన కొడుకు మిథున్ రెడ్డి గతంలో వలే రాజంపేట ఎంపీగా బరిలో ఉన్నారు. పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబల్లపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మంత్రాలయం ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిరెడ్డి గుంతకల్లు నుంచి పోటీలో ఉన్నారు. బాలానాగిరెడ్డి మరో సోదరుడు సాయిప్రసాద్ రెడ్డి అదోని నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇక మంత్రి ధర్మాన ప్రసాద్ రావు శ్రీకాకుళం నుంచి, కృష్ణ దాస్ నరసన్నపేన నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. కొండెపి నుంచి ఆదిమూలపు సురేష్, ఆదిమూలపు సతీష్ కొడుమూరు నుంచి పోటీకి అవకాశం కల్పించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒంగోలు ఎంపీగా ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడీ అవుతున్నారు.

తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మరోసారి అదే నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగుతున్నారు. ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ కూ టికెట్ లభించింది. అలాగే మేకపాటి విక్రం రెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలకు జగన్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు టికెట్లు ఇచ్చారు. మొత్తంగా వైసీపీ అభ్యర్థుల జాబితాలలో ఫ్యామిలీ ప్యాకేజీలకే జగన్ పెద్ద పీట వేశారు. దీంతో.. జగన్ ఎవరి మాటలు వినడు అనే ప్రచారం పటాపంచలు అయింది. అంతేకాదు.. మొదట సిట్టింగులను మార్చుతానని హడావుడి చేశారు. దీంతో.. ఒక్కోజాబితా ఆలస్యమైంది. పైగా నిరసనలు, ఆందోళనలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో.. ఆయన చివరి జాబితాలో సిట్టింగులకే అవకాశం కల్పించారు. ఇలా చివరికి అన్ని ఒత్తిళ్లకు జగన్ లొంగాల్సి వచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -