Kodali Nani: సచివాలయం అంటే 10 ఎకరాల భూమి మాత్రమేనట.. కొడాలి అజ్ఞానానికి ప్రూఫ్స్ ఇవే!

Kodali Nani: వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుల గూండాయిజం రౌడీయిజం రోజురోజుకు పెరిగిపోతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నాయకుల పై నోరు పారేసుకుంటూ ఉన్నారు ఇకపోతే తాజాగా మరోసారి ఆంధ్రుల ఆత్మగౌరవం అయినటువంటి సచివాలయం గురించి నాని చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టుపెట్టి 370 కోట్ల రూపాయల డబ్బును అప్పుగా తీసుకున్నారు. ఇలా సచివాలయాన్ని తాకట్టు పెట్టారనే విషయం తెలియడంతో చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టింది ఒక భవనం కాదని ఆంధ్రుల ఆత్మ గౌరవం అని జగన్ పరిపాలనపై మండిపడ్డారు. దీంతో కొడాలి నాని స్పందిస్తూ.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా ఏ బ్యాంకు కూడా లోన్ ఇవ్వదు ఆ మాత్రం చంద్రబాబు నాయుడుకు తెలియదా. ఇప్పుడు సచివాలయాన్ని తాకట్టు పెట్టిన అప్పు చెల్లించి సచివాలయాన్ని విడిపించుకుంటాము సచివాలయాన్ని తాకట్టు పెట్టకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాసిందా అంటూ మాట్లాడారు.

సచివాలయం అనేది కేవలం 10 ఎకరాల భూమి మాత్రమేనని అక్కడ ఎకరం రెండు కోట్లతో ఆ భూమి విలువ 20 కోట్లు మాత్రమే అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అయితే ఈయన వ్యాపార లావాదేవీల ధోరణిలో ఆలోచిస్తున్నారు కానీ ఆంధ్ర మనోభావాల గురించి ఆలోచించడం లేదని, కొడాలి నాని ఇలా ప్రభుత్వ ఆస్తుల గురించి మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అంటూ పలువురు టిడిపి నేతలు కొడాలి నాని వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -