YSRCP MLCs: వైసీపీకి గుడ్ బై చెబుతున్న వరుస ఎమ్మెల్సీలు.. పదవీకాలం ఉన్నా పరిస్థితి ఘోరమంటూ?

YSRCP MLCs: పదవులు ఉన్నాయి.. పార్టీ అధికారంతో సంబంధం లేదు.. మరో మూడేళ్లు తమ పదవులకు డోకా లేదు. కానీ.. పార్టీ వీడుతున్నారు. ఇంత విచిత్రమైన దోరణి దేశంలో మరెక్కడా లేదు. ఏపీలోని వైసీపీలోనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల దగ్గర పడ్డాయంటే పార్టీ గాలిని బట్టి వలసలు, చేరికలు ఉంటాయి. అది కూడా ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు అలా చేస్తారు. ఎందుకంటే.. వారి పదవీకాలం అప్పుడే ముగుస్తుంది కనుక.. గాలి ఎటువైపు వీస్తుందో అంచనా వేసుకొని పార్టీని వీడుతూ ఉంటారు. కానీ.. రాజ్యసభ, శాసనమండలి సభ్యులు మాత్రం అలా చేయరు. ఎందుకంటే.. పార్టీ అధికారంతో సంబంధం ఉండదు. అధికారం చేతులు మారినా.. వారి పదవీకాలం ముగిసే వరకూ పదవీ గండం ఉండదు. కానీ.. ఇవేవీ ఆలోచించకుండా పార్టీ మారుతున్నారో.. లేదంటే మరో అంచనాతో మారుతున్నారో తెలియదు కానీ.. వైసీపీని వరుసగా ఎమ్మెల్సీలు వీడుతున్నారు.

వంశీ కృష్ణయాదవ్, సి రామకృష్ణయ్య, జంగా కృష్ణమూర్తి తర్వాత మహ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీగా ఉంటూనే పార్టీని వీడారు. రీసెంట్‌గా హిందూపురంలో పెద్ద షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ప‌ద‌వికి, వైసీపీకి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్‌కు సైతం ఇక్బాల్ ఫ్యాక్స్‌తో పాటు ఈ-మెయిల్ పంపించారు. మ‌రో మూడేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక్బాల్ త్వరలోనే పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హిందూపురం అభ్యర్ధిగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకునే దీపికను బరిలోకి దింపింది వైసీపీ. పెద్దిరెడ్డి రికమండేషన్‌తోనే ఆమెకు టికెట్ ఇచ్చారంట.. దీపికను గెలిపించుకునే బాధ్యత తనదేనని జగన్‌కు భరోసా ఇచ్చి ఆమెకు టికెట్ ఇప్పించుకున్నారంట. దీపికకు హిందూపురం ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టినప్పుడే ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎదురుదాడికి దిగారు. నాలుగేళ్లు ఇన్చార్జ్‌గా ఉన్న తనను తప్పించడం ఏంటని అప్పట్లో ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయి సడన్ గా రాజీనామా అస్త్రం సంధించారు.

ఇక్బాల్ మాత్రమే కాదు.. ఎమ్మెల్సీలు అంతా పదవీకాలం కనీసం రెండేళ్లు ఉండగానే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అలా అని వారంతా చేరుతున్న పార్టీలో టికెట్ ఆశిస్తున్నారా? అంటే అదీలేదు. వైసీపీలో టికెట్ ఆశించి బంగపడటం ఖాయమే కానీ.. కూటమి పార్టీల్లో మాత్రం టికెట్ ఆశించడం లేదు. మరి ఎందుకు వీరంతా పదవి చేతిలో ఉండగా పార్టీని వీడుతున్నారే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా బయటకు వచ్చిన వారిలో ఓ బలిజ, ఓ మైనార్టీ, ఇద్దరు బీసీ ఎమ్మెల్సీలు ఉన్నాయి. తెల్లారి లేస్తే జగన్ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటారు. కానీ.. ఆయా సామాజికవర్గాల నేతలకు మాత్రం జగన్ పై నమ్మకం ఉండటం లేదు. దీనికి కారణం.. కేవలం జగన్ ఏకపక్ష నిర్ణయాలే అని తెలుస్తోంది. జగన్ పార్టీలో ఎవరి అభిప్రాయాలకు విలువ ఇవ్వరని విసిగి చెంది పార్టీలకు, పదవులకు రాజీనామా చేస్తున్నారు. పేరుకే ఆయన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటున్నారే తప్ప అధికారం మాత్రం ఇవ్వడం లేదు. పదవులను ఇచ్చి నాయకులను ఉత్సవ విగ్రహాలుగా మార్చుతున్నారనే విమర్శ జగన్ పై మొదటి నుంచి ఉంది. పదవులు పంచి పవర్స్ మాత్రం ఆయన దగ్గరే ఉంచుకుంటున్నారని పార్టీనేతలు జగన్ పై ఆగ్రహంగా ఉన్నారు. అందుకే.. పార్టీ నేతలు పదవులను తీసి పక్కన పెట్టి పార్టీని వీడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -