YS Jagan: మరోసారి గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిని మార్చాల్సిందేనా.. జగన్ కే ఎందుకిలా?

YS Jagan: వైసీపీలో అభ్యర్థుల ప్రకటనలు ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. ఎప్పుడు ఎవరి పేరు తెరపైకి వస్తుందో? ఎవరి పేరు మాయమవుతుందో తెలియడం లేదు. గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి విషయంలో వైసీపీ తీవ్రంగా కసర్తతు చేససింది. వడపోతలు, తర్జన భర్జనలు క్యాండిడేట్ ను ఫైనల్ చేసింది. వైసీపీ ప్రకటించిన 8వ జాబితాలో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారి రోశయ్యను ప్రకటించింది. ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న రోశయ్యను ఈసారి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పంపించారు. అయితే.. ఆయన నియోజకవర్గంలో సీరియస్ గా పని చేయడం లేదు. ఓటమి ఖాయమని ముందే ఫిక్స్ అయ్యి లైట్ తీసుకుంటున్నారా? లేకపోతే.. అధినేత వైఖరిని గుర్తించి నామినేషన్ వరకు తనపేరు లిస్టులో కొనసాగుతుందా? లేదా? అన్న అనుమానంతో పని చేయడం లేదో తెలియదు కానీ.. ప్రజలుతో మమేకం కావడం లేదు. అంతేకాదు.. గుంటూరు పార్లమెంట్ నియోజవర్గం పరిధిలో ఉన్న అసంబ్లీ స్థానాల అభ్యర్థలతో కూడా ఇంకా కనెక్ట్ కావడం లేదు. అక్కడ ఖర్చు చేయడానికి కూడా రోశయ్య వెనకడుగు వేస్తున్నారు. దీంతో.. మరోసారి అభ్యర్థి మార్పు ఖాయమనే చర్చ వైసీపీలో జోరుగా నడుస్తోంది.

మొదట గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమారెడ్డి వెంకటరమణను నియమించారు. ఆయన ఒకసారి మాత్రమే ఆ నియోజకవర్గానికి వెళ్లి తర్వాత దూరంగా ఉన్నారు. దీంతో రమణను తప్పించి ఆయన స్థానంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య పేరును ప్రకటించారు. అప్పుడే ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

ఇప్పుడు అంబటి రాంబాబు పేరు కూడా తెరపైకి వస్తుంది. ప్రస్తుతం సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సొంతపార్టీ నేతలే ఆయనకు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో.. ఈసారి సత్తెనపల్లిలో ఆయనకు టికెట్ దక్కే ఛాన్స్ లేదని వైసీపీలో ఓ వర్గం చర్చించుకుంటున్నారు. ఆయన స్థానంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని సత్తెనపల్లి బరిలో దించుతారని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే రాంబాబును గుంటూరు ఎంపీగా పంపినా ఆశ్చర్య పడాల్సిన పని లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది.

గుంటూరు ఎంపీ స్థానంలోనే కాదు.. చిలకలూరి పేట, గుంటూరు వెస్ట్ పై కూడా గందరగోళం నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడదల రజినిని.. నియోజకవర్గం నుంచి గుంటూరు వెస్ట్‌కు మార్చిన అధిష్టానం.. చిలకలూరిపేటలో ఆమె వర్గానికే చెందిన రాజేష్‌నాయుడుని ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించింది. మొదట్లో రాజేష్ నాయుడు రజినీ ఇమేజ్ ను వాడుకునే ప్రయత్నం చేశారు. ఆమె గురించి పాజిటివ్ గా ప్రకటనలు చేశారు. నియోజవర్గంలో ఆమె అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. అయితే సడెన్ గా చిలకలూరిపేట అభ్యర్థిగా మల్లెల రాజేష్‌ నాయుడు స్థానంలో కవాటి మనోహర్ నాయుడిని అధిష్టానం ప్రకటించింది. దీంతో రాజేష్ నాయుడు అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో నియోజకవర్గంలో కష్టపడి పని చేస్తున్న తనను కాదని.. మరో వ్యక్తికి టికెట్ ఇవ్వటాన్ని రాజేష్‌నాయుడు అనుచరులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటి వరకూ రజనీకి అనుకూలంగా మాట్లాడిన రాజేష్ నాయుడు తన పేరును మార్చడంతో.. మంత్రి రజినీపై కూడా టార్గెట్‌ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరు వెళ్లి పోటీ చేయడం కాదని చిలకలూరు పేటకు వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరారు. తనకు టికెట్‌ ఇవ్వని పక్షంలో…మర్రి రాజశేఖర్‌కు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మర్రి రాజశేఖర్ కు టికెట్‌ ఇస్తే తాను 20 కోట్లు ఖర్చు చేసి గెలిపించుకుంటానని సవాల్ చేశారు. ఈ అభ్యర్థుల మార్పు అర్థం కాక పార్టీ కేడర్ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎవరు తమ అభ్యర్థో తెలియక.. ఎవరికి సపోర్టు చేయాలో అర్థం కాక జుట్టు పీక్కకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -