సీఎం జగన్ ప్రాధాన్యత బీసీలకే.. ఇంచార్జుల మార్పు ద్వారా సీఎం జగన్ స్పష్టం చేసింది ఇదేనా?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. దీంతో అధికార పార్టీ నేత ముఖ్యమంత్రి జగన్ పార్టీని సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎమ్మెల్యేలుగా, నియోజకవర్గ ఇంచార్జులుగా ఉన్న వారిలో పనితీరు బాగాలేని, ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న వారిని తన ఎన్నికల టీము నుంచి తొలగించేందుకు సిద్ధం అయ్యారు. దాంతో వైసీపీలో దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్స్ దక్కని పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా తాజాగా 11 నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జులను నియమించారు జగన్. రానున్న రెండు మూడు రోజుల్లో మిగతా చోట్ల కూడా కొత్త ముఖాలు కనిపిస్తాయి.

 

ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వాళ్లకు సైతం టిక్కెట్స్ ఇవ్వడం ద్వారా తెలంగాణాలో కేసీఆర్ ఎలా దెబ్బతిన్నారో గుర్తించిన జగన్ ఇప్పటినుండే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ప్రజామోదం లేనివారికి టిక్కెట్స్ ఇచ్చేది లేదని ఈ ఇంచార్జుల మార్పు ద్వారా స్పష్టం చేసారు. ఇదే విషయం గురించి పార్టీ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో గెలుపే ప్రాతిపదికగా నిర్ణయం తీసుకున్నాము. వైఎసార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలి. అందుకోసం వైఎస్ జగన్ సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో కూడా మార్పులు ఉంటాయి అని స్పష్టం చేసారు సజ్జల రామకృష్ణారెడ్డి.

కాగా సీఎం జగన్ దూకుడు చూస్తుంటే జెట్ స్పీడ్ లో ఎన్నికలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెనుకబడిన వర్గాలకు మరింత గుర్తింపు, ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఇలా ఇంచార్జులుగా నియమించినట్లు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -