Amit Shah: అమిత్ షాకు వైవీ సుబ్బారెడ్డి దిమ్మతిరిగే కౌంటర్లు.. ఏం జరిగిందంటే?

Amit Shah: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఒక పార్టీ నేతలు మరొక పార్టీ నేతలు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇన్ని రోజులు రాష్ట్ర బిజెపి నాయకులు వైసిపి నాయకులు పై ఎన్ని విమర్శలు చేసిన వైసీపీ నేతలు మాత్రం చాలా సైలెంట్ అయ్యారు. కానీ తాజాగా టిడిపి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఇటీవల కాలంలో వరుసగా బిజెపి మంత్రులు ఏపీకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా వరుసగా ఆంధ్రప్రదేశ్ కి రావడం పట్ల ఇక్కడ రాష్ట్ర రాజకీయాలలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇలా ఈ ఇద్దరు మంత్రుల సమక్షంలో జరిగిన వేదికలలో ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేయడంతో వైసిపి నేతలు కూడా తమ స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.

ఇవాళ విశాఖ‌ప‌ట్నంలో టీటీడీ చైర్మ‌న్, ఉత్త‌రాంధ్ర పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ట్రాప్ లో బీజేపీ ప‌డింద‌ని.. అందుకే టిడిపి నేతల మాటలే అమిత్ షా మాట్లాడారని ఇక ఆ వేదికపై పసుపు కండువా తీసేసి కాషాయం ఖండవ వేసుకున్న తెలుగుదేశం నేతలే ఉన్నారంటూ విమర్శలు కురిపించారు. గతంలో బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఈయన కౌంటర్ వేశారు.

 

కేంద్రమంత్రి అమిత్ షా వైజాగ్ వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోవడం ఎంతో దారుణం అంటూ మండిపడ్డారు.చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. ఇక బిజెపి కూడా పొత్తుకు సిద్ధమవుతోంది అంటూ ఈ సందర్భంగా సుబ్బారెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -