RK Roja: రోజా రాకకు ముందే ప్రారంభోత్సవాలు.. నగరిలో రోజా పరువు తీసేస్తున్నారుగా!

RK Roja: వైసిపి ఎమ్మెల్యే మంత్రిగా కొనసాగుతున్నటువంటి వారిలో నటి రోజా ఒకరు. ఈమె ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు కొనసాగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో నగరి నియోజకవర్గంలో రోజా పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడిందనే విషయం మనకు తెలిసిందే. ఇలా నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా ఉండడంతో తనకు సీటు ఇవ్వడం గురించి కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులపాటు సందిగ్ధంలో ఉన్నారు.

ఇక నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో కూడా రోజాకు ఇటీవల కాలంలో పూర్తిగా చేదు అనుభవాలు ఎదురవుతూ వస్తున్నాయి. గతంలో తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పలు గ్రామాలలో సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లకు రోజా అన్ని సిద్ధం చేసుకున్నారు అయితే వడమాల పేట జడ్పిటిసి సభ్యులు మురళీధర్ రెడ్డి ఆ భవనాన్ని నిర్మించినందుకు తాను కాంట్రాక్టు తీసుకొని నిర్మించాలని తనకు బిల్లులు పడే వరకు సచివాలయం ప్రారంభించడానికి వీలులేదు అంటూ సచివాలయ తలుపులు మూసివేసిన సంగతి తెలిసిందే.

ఇలా మురళీధర్ రెడ్డి ద్వారా రోజాకు చేదు అనుభవం ఎదురయింది. అయితే తాజాగా మరోసారి నగరిలో రోజాకు మురళీధర్ రెడ్డి నుంచి చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. వడమాల పేట మండలం అప్పలాయగుంట గ్రామంలో సచివాలయం, పత్తి పుత్తూరులో రైతు భరోసా కేంద్రం, జగనన్న పాల సేకరణ కేంద్రాలను మంత్రి రోజా ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే మంత్రి రోజా ప్రారంభోత్సవాన్ని కంటే ముందుగానే వడమాల పేట జడ్పిటిసి సభ్యుడు మురళీధర్ రెడ్డి ఆదివారమే ఈ మూడు కార్యాలయాలను ప్రారంభించారు.

ఈ విధంగా రోజా రాకుండానే స్థానిక జడ్పిటిసి సభ్యుడు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించడంతో రోజాకు తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని నగరి నియోజకవర్గ ప్రజలు రోజా పట్ల పూర్తిగా వ్యతిరేకత చూపుతున్నారు అనడానికి ఇదే గొప్ప నిదర్శనం అంటూ టిడిపి నేతలు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -