GodFather: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో హిట్టవుతుందా?

GodFather: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా ‘గాడ్ ఫాదర్’ దసరా కానుకగా విడుదలైంది. మలయాళం మూవీ ‘లూసిఫర్’ సినిమాకు ఈ మూవీ రీమేక్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు పెద్దగా రాబట్టలేకపోయింది. అయితే మోహన్‌లాల్ నటించిన ‘లూసీఫర్’ సినిమా కూడా తెలుగులో డబ్ అయింది. దీంతో గాడ్ ఫాదర్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించడంతో హిందీలో కాస్త వరకు కలెక్షన్లు వసూలు చేసింది. అయితే సినిమా ఎండింగ్‌లో చిరంజీవి-సల్మాన్ ఖాన్ స్పెషల్ సాంగ్ ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ ఫుల్ హిట్ అయింది. చాలా రోజుల తర్వాత చిరంజీవి మంచి పాత్రలో నటించారని విమర్శకులు తెలిపారు.

 

తాజాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్లు సిద్ధమయ్యారు. ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి ఖైదీ పాత్రలో అదరగొట్టారు. గతంలో చిరంజీవి ‘ఖైదీ, ఖైదీ నంబర్ 786, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, అల్లుడా మజాకా, ఖైదీ నంబర్ 150 వంటి సినిమాల్లో ఖైదీ పాత్రల్లో నటించారు. గాడ్ ఫాదర్ సినిమాలో కూడా చిరంజీవి ఖైదీ పాత్రలో అలరించారు. అయితే ఖైదీ పాత్రలో నటించిన చిరంజీవి సెంటిమెంట్ కలిసొచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే గాడ్ ఫాదర్ సినిమాను తెలుగు, హిందీలో నవంబర్ 19న స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ లిరిక్స్ అందించగా.. నయనతార, సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యదేవ్ యాక్టింగ్ గాడ్ ఫాదర్ సినిమాకు ప్లస్ అయింది. అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా నటించడం సినిమాకు ప్లస్‌గా మారింది. కాగా, నవంబర్ 19న నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా కూడా స్ట్రీమింగ్ కానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -