YouTube: యూట్యూబ్‎లో వచ్చిన కొత్త ఫీచర్ గురించి తెలుసా?

YouTube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ తాజాగా కొత్త ఫీచర్లు తెచ్చింది. ఇందులో చానెల్స్‌లోని వీడియోలను మూడు ప్రత్యేక ట్యాబ్ లలో విభజించనున్నారు. తాజాగా యూట్యూబ్‌కు అనేక ఫీచర్స్ అదనంగా వచ్చాయి. ఇందులో భాగంగా కొత్త ట్యాబ్స్ సదుపాయాన్ని యూట్యూబ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఉపయోగాలు ఏముంటాయో ఇక్కడ తెలుసుకోండి..

 

యూట్యూబ్ తెచ్చిన కొత్త ఫీచర్ ప్రకారం.. ఏదైనా యూట్యూబ్ చానల్ లాంగ్ వీడియోలు, షార్ట్స్, లైవ్ వీడియోలను ఈజీగా గుర్తించొచ్చు. యూజర్లకు కొత్తగా ఉపయోగపడుతుంది. ఇప్పటి దాకా లెన్తీ వీడియోలు, షార్ట్స్, లైవ్ వీడియోలన్నీ ఒకే వరుసలో యూజర్ కు కనిపిచేవి. చానల్ లో వెతకడానికి కొంచం సమయం పట్టేది.

 

యూట్యూబ్ కొత్తగా తెచ్చిన ఫీచర్ లో వీటికి సులువైన పరిష్కారం దొరికింది. చానల్ పేజీలో లాంగ్ వీడియోలు, యూట్యూబ్ షార్ట్స్ కు స్పెషల్ ట్యాబ్స్ ను క్రియేట్ చేశారు. లైవ్ వీడియోలను మరో కేటగిరీ కింద విభజిస్తూ ట్యాబ్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో కూడా యూట్యూబ్ షార్ట్స్ ను ప్రత్యేకంగా చూడాలనుకొనే వారికి షార్ట్స్ ట్యాబ్ ఉపయోగపడుతుంది.

 

వెబ్ వెర్షన్ లోనూ అందుబాటులోకి..
మరోవైపు ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూట్యూబ్ యాప్స్ తో పాటు వెబ్ వెర్షన్ లో కూడా ఇలాంటి సౌకర్యం తెచ్చింది యూట్యూబ్. ఈ క్రమంలో చాలా మొబైళ్లకు ఇప్పటికే యూట్యూబ్ ఈ అప్ డేట్స్ ను చేర్చింది. ఇంకా కొందరికి అప్ డేట్ రావాల్సి ఉంది. చానల్ పేజీ డీటెయిల్స్ ను కూడా యూట్యూబ్ మారుస్తోంది. డార్క్ మోడ్ ఇంకా పెరిగింది. లైక్, డిస్ లైక్ బటన్లను కాస్త డిఫరెంట్ గా మార్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -